కొనసాగుతున్న భారత్ బంద్

కొనసాగుతున్న భారత్ బంద్

పెరుగుతున్న గ్యాస్,  పెట్రోల్ ధరలకు నిరసనతో పాటు  జీఎస్టీ నిబంధనలను  సమీక్షించాలంటూ  ఇవాళ  భారత్ బంద్ నిర్వహిస్తోంది అఖిల  భారత వ్యాపారుల  సమాఖ్య. దేశం మొత్తం  ఇంధన ధరలు  ఒకేలా ఉండాలని డిమాండ్ చేశారు సమాఖ్య జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్ వాల్.  బంద్ లో 40 వేల వాణిజ్య సంఘాలు పాల్గొంటున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 15 వందల ప్రాంతాల్లో  నిరసనలు చేస్తున్నామన్నారు  ప్రవీణ్. భారత్ బంద్ కు అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది.

జీఎస్టీ నిబంధనల్లో సవరణలు చేయాలని గత ఆదివారమే ప్రధాని మోడీకి లేఖ రాసింది అఖిల భారత  వ్యాపారుల సమాఖ్య. ఈ కామర్స్  సంస్థలను నియంత్రించాలని కోరింది. జీఎస్టీ బిల్లులో సవరణలకు  కేంద్ర స్థాయి  అధికారులతో  ప్రత్యేక బృందం  ఏర్పాటు చేయాలంటున్నారు  సమాఖ్య ప్రతినిధులు.