కొనసాగుతున్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్

కొనసాగుతున్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లుండగా 20,  37 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన 58 డివిజన్లకు సంబంధించి కరీంనగర్ SRR కళాశాల ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కోసం మొత్తం 58 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లను నియమించారు. వీరికి ఒక్కొక్కరికి ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా డివిజన్ల వారిగా పోస్టల్ బ్యాలెట్ల్ ను లెక్కిస్తారు. అన్ని డివిజన్లలో కలిపి 500లకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. డివిజన్ల వారీగా ఓట్లను లెక్కించనునన్నారు. 25 ఓట్లకు ఒక కట్ట కట్టి… రౌండుకు వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సీసీ కెమెరాలో రికార్డ్ చేస్తారు. కౌంటింగ్ కు పోటీ చేసిన అభ్యర్థి కానీ వారి తరపున ఏజెంట్ ను ఒక్కరినే హాల్ లోకి అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్స్, అగ్గిపెట్టెలు తీసుకురావద్దని ఇప్పటికే ఆదేశాలిచ్చారు.