కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్

కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్

రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం  7 గంటలకు మొదలైన ఓటింగ్  సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట, నల్గొండ జిల్లాలోని నకిరేకల్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా  అచ్చంపేట, జడ్చర్ల, రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాల్టీలకు పోలింగ్ జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 66 డివిజన్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 502 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 296 ప్రాంతాల్లో 878 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 6 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఒక్కో పోలింగ్ బూత్ లో పీఓ తో పాటు, ఏపీఓ, ముగ్గురు అధికారులున్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం మొత్తం 5 వేల 320 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. నగరంలోని 37 సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు బందోబస్తు ఉన్నారు.


ఇక ఖమ్మం కార్పొరేషన్ లో 60 సీట్లలో ఒక్క డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 59 స్థానాల్లో 251 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఖమ్మంలో 377 పోలింగ్ సెంటర్లు  ఏర్పాటు చేశారు. 2 వేల 500  మంది సిబ్బందిని అలాట్ చేశారు.  ప్రతి పోలింగ్ బూత్ లో  ఐదుగురు సిబ్బంది, ఆశావర్కర్లు  ఉన్నారు. ప్రతీ ఒక్కరికి  ఫేస్ షీల్డ్, మాస్కులు, శానిటైజర్,  గ్లౌజులు ఇచ్చారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు పోలింగ్ మొదలైంది. ఇక్కడ మొత్తం లక్షా 653 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కు 485 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులకు మాస్కులు, శానిటైజర్ బాటిళ్లు ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీలతో పాటు  రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పోలింగ్ జరుగుతోంది. వీటితో పాటు నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్ పల్లి, ఆలంపూర్, జల్పల్లి, గజ్వేల్ మున్సిపాలిటీలలోని ఒక్కో వార్డుకు బై పోల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మే 3 న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.