రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్…, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. గంట బ్రేక్ ఇచ్చాక.. 2 గంటల నుంచి ఓట్లు లెక్కింపు మొదలవుతుంది. సాయంత్రం వరకు ఫలితాలు ప్రకటించనున్నారు. పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. గెలిచిన వారికి ధృవీకరణ పత్రం అందించనున్నారు.
రాష్ట్రంలోని 909 సహకార సంఘాలకు గానూ, నాలుగు చోట్ల ఇంకా పదవీకాలం పూర్తికాకపోవడంతో ఎన్నికలు నిర్వహించడం లేదు. 905 సంఘాల్లో 157 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇవాళ వార్డు సభ్యులుగా ఎన్నికయ్యే వారు రేపు, ఎల్లుండి సహకార సంఘాలకు ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. మొత్తం 11 లక్షల 48 వేల మంది ఓటు హక్కును వినియోగించకుంటున్నారు. సహకార ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రత్యక్ష చొరవ ఉండకపోయినా… తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

