గతవారం టర్కీలో జరిగిన భూకంప ఘటనలో మృతుల సంఖ్య 24,617 దాటింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయకుండా సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. టర్కీలోని హతేలో 128 గంటల శ్రమించిన తర్వాత రెస్క్యూ టీం రెండు నెలల పసి పాపని ప్రాణాలతో రక్షించాయి. ఆరు నెలల గర్భిని, 70 వృద్ధురాలిని కూడా శిథిలాలనుండి కాపాడారు. వేలాదిమంది రెస్క్యూ వర్కర్లు కూలిపోయిన 6,000 భవనాల కింద వెతుకుతున్నారు.
