ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ‌‌‌‌‌‌‌‌క్లాసులు వినలేని స్టూడెంట్ల కోసం గోడ బ‌డి

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ‌‌‌‌‌‌‌‌క్లాసులు వినలేని స్టూడెంట్ల కోసం గోడ బ‌డి

ముంబై: కొవిడ్‌‌‌‌‌‌‌‌19 వల్ల స్కూళ్లు తెరవలేదు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో క్లాసులు స్టార్ట్ చేశారు. కానీ పేద ‌‌‌‌‌‌‌పిల్లలు స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు లేక క్లాసులు వినలేక పోతున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా మహారాష్ట్రలోని షోలాపూర్‌‌‌‌‌‌‌‌లో ఉన్నఓ స్కూల్ వెరైటీగా ఆలోచించింది. పిల్ల
లకు ఎట్లాగైనా చదువు చెప్పాలనే ఆలోచనతో మంచి సెటప్ ‌‌‌‌‌‌‌చేసింది. స్కూల్‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లోని 300 వరకు ఇండ్ల గోడలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్‌ బుక్స్‌‌‌‌‌‌‌‌లోని ముఖ్యమైన పాఠాలను సింప్లిఫై చేసి పెయింట్ ‌‌‌‌‌‌‌వేయించింది. ఇలాంటి పద్ధతులు పిల్లలకు చాలా ఉపయోగపడతాయని, లెస్సన్స్ ‌‌‌‌‌‌‌‌రివైజ్ ‌‌‌‌‌‌‌‌చేసుకోవడానికి కూడా పిల్లలకు ఈజీగా ఉంటుందని ఆశా మరాఠీ విద్యాలయ స్కూల్‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌ రామ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ అన్నారు.

ఇక్కడి ప్రైమరీ, సెకండరీ స్కూల్‌‌‌‌‌‌‌‌లో 1,700 మంది వరకు స్టూడెంట్లు చదువుకుంటున్నారని.. వీళ్ల తల్లిదండ్రుల్లో చాలా మంది రోజు కూలీలని, టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్ ‌‌‌‌‌‌‌పరిశ్రమల్లో పని చేస్తుంటారని చెప్పారు. ఇలాంటి వాళ్ల‌కు స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ఇంటర్నెట్ ‌‌‌‌‌‌‌‌ఉండవని, చదువుకోలేకపోతున్నారని తెలిపారు. అందుకే ఇలా ఆలోచించామని చెప్పారు. పిల్లలు సోషల్ ‌‌‌‌‌‌‌‌డిస్టెన్స్ ‌‌‌‌‌‌‌పాటిస్తూ పాఠాలు చూసుకోవచ్చని అన్నారు. ఆశా మరాఠీ స్కూల్లో తన పిల్లలు చదువుతున్నారని, కానీ పిల్లల ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌ ‌‌‌‌క్లాసులకు తన దగ్గర స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లేదని అక్కడి దగ్గర్లోని ఓ క్యాంటిన్‌‌‌‌‌‌‌‌లో పని చేసే నగేశ్‌‌‌‌‌‌‌‌ ఖుల్లర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఇలా గోడలపై పాఠాలు వేయడం పిల్లలకు ఒకింత ఉపయోగకరంగానే ఉందన్నారు.