ప్రభుత్వ పాఠశాలల్లో జూలై 13 నుంచి ఆన్ లైన్ క్లాసులు

ప్రభుత్వ పాఠశాలల్లో జూలై 13 నుంచి ఆన్ లైన్ క్లాసులు

కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల చదువు అయోమయంలో పడింది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టాయి. మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి? అందుకే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గురించి బాగా ఆలోచించిన తమిళనాడు ప్రభుత్వం.. వారికి కూడా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి సెంగోట్టయ్యన్ తెలిపారు. క్లాసుల నిర్వహణ కోసం ఐదు ప్రైవేట్ చానెల్స్ సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కో చానెల్.. ఒక్కో సబ్జెక్ట్ ని ప్రసారం చేస్తుందని ఆయన తెలిపారు. అందుకోసం ఇప్పటికే విద్యార్థులకు పుస్తకాలు కూడా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా వల్ల చాలామంది విద్యార్థలు తమతమ పరీక్షలకు హాజరు కాలేకపోయారని.. వారందరి గురించి సీఎం తగు నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.

For More News..

ఒకరి నుంచి 119 మందికి కరోనా.. ఫలితాలు రావాల్సినవి మరికొన్ని

కొత్త విద్యా సంవత్సరం ప్రకటించిన ఏఐసీటీఈ

ప్రధానిని టార్గెట్ చేయాలంటే ఎంతసేపు?