నిజాంపేటలో ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ జాబ్ ఆఫర్ లింక్..రూ.45 వేలు మాయం

నిజాంపేటలో ఇన్ స్టాగ్రామ్ లో  ఫేక్ జాబ్ ఆఫర్ లింక్..రూ.45 వేలు మాయం

నిజాంపేట, వెలుగు:  మొబైల్ లో ఇన్ స్టాగ్రామ్ చూస్తూ ఉండగా వర్క్ ఫ్రామ్ హోమ్ అనే ఫేక్ జాబ్ లింక్ ను చూసి దానిపై క్లిక్ చేయగానే అకౌంట్ లో ఉన్న డబ్బులు పోయాయి. ఈ సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం జరిగింది. నిజాంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  మండల కేంద్రానికి చెందిన తాడెం మౌనిక ఇంట్లో ఉండి ఇన్ స్టాగ్రామ్ చూసే క్రమంలో వర్క్ ఫ్రమ్​ హోమ్ అనే లింక్ ఆన్లైన్ లో వచ్చింది.

 దాన్ని చూసి ఆమె ఆ లింక్ ను క్లిక్ చేయగానే తన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ.45 వేలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఎవరు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఎటువంటి లింక్ లను క్లిక్ చేయొద్దని నిజాంపేట ఎస్ ఐ రాజేష్ పేర్కొన్నారు.