ఒక్క దెబ్బతో డ్రీమ్11 పని ఖతం: ఇక టీం ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా కొనసాగలేదు...

ఒక్క దెబ్బతో డ్రీమ్11 పని ఖతం: ఇక టీం ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా కొనసాగలేదు...

గత వారం పార్లమెంటు ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025 ఆమోదించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ ప్రకటన తరువాత డ్రీమ్11తో 358 కోట్ల డీల్  క్యాన్సల్ చేసుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) సోమవారం తెలిపింది. దింతో గేమింగ్ యాప్ డ్రీమ్11 రియల్ మనీ గేమింగ్ మూసేస్తున్నట్లు ప్రకటించింది.

 BCCI కార్యదర్శి దేవచిత్ సైకియా  ఇక క్రికెట్ బోర్డు భవిష్యత్తులో ఇలాంటి సంస్థలతో ఒప్పందం పెట్టుకోదని, ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025 ఆమోదించిన తర్వాత BCCI & డ్రీమ్ 11 డీల్  నిలిపివేసింది. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సంస్థలతో BCCI జోక్యం చేసుకోకుండా చూసుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఈ బిల్లు రియల్-మనీ గేమింగ్ ప్రమోషన్, యాడ్స్, స్పాన్సర్‌షిప్‌లపై నిషేధం వహిస్తుంది, దింతో డ్రీమ్ 11 టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా  కొనగసాలేదు.... 

డ్రీమ్11-బీసీసీఐ ఒప్పందం : 2023లో డ్రీమ్11 బైజూస్ స్థానంలో లీడ్ స్పాన్సర్‌గా చేరి BCCIతో మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. దీని మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ FY23లో ప్రకటనలు, ప్రమోషన్ల కోసం దాదాపు రూ.2,964 కోట్లు ఖర్చు చేసింది. 

జూలై 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత జట్టు తొలిసారిగా డ్రీమ్11 లోగో ఉన్న జెర్సీ ధరించి కనిపించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో (FY24) డ్రీమ్11 రూ.9,600 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. అయితే రియల్-గేమింగ్ వ్యాపారం మూసేయడంతో కంపెనీ ప్రస్తుతం భారీ నష్టాన్ని ఎదుర్కొంటోంది.

పరిశ్రమ అంచనాల ప్రకారం ఫాంటసీ స్పోర్ట్స్ మార్కెటింగ్ కోసం సంవత్సరానికి 5వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తాయి. అయితే ఆగస్టు 22 శుక్రవారం బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొత్త చట్టం అమల్లోకి రావడంతో ఈ అడ్వాటైజింగ్  సిస్టంను చాల దెబ్బతీస్తుందని భావిస్తున్నారు.