29 శాతం స్టార్టప్​లకే లాభాలు

29 శాతం స్టార్టప్​లకే లాభాలు

న్యూఢిల్లీ: మనదేశంలో ఇప్పటికీ స్టార్టప్​లను పెద్దగా విజయాలు వరించడం లేదు. లాభాలు రావడం చాలా తక్కువగా ఉంది. వెంచర్ ఇంటెలిజెన్స్ ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య 100 మిలియన్​ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ రెవెన్యూ సంపాదించిన స్టార్టప్‌‌లలో కేవలం 3.5శాతం మాత్రమే లాభాల్లో ఉన్నాయి. 2021లో అదే సమయంలో 29.2శాతం స్టార్టప్​లు లాభాల్లో ఉండేవి. ఈ 12 నెలల్లో 48 కంపెనీలు 100 మిలియన్​ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ రెవెన్యూ సాధించాయి.వీటిలో  18 కంపెనీల ఆదాయాలకు ఇబిటా (వడ్డీ, పన్నులు, తరుగుదల,  అప్పులు తీర్చడానికి ముందు ఆదాయం) లెక్కలు అందుబాటులో లేవు.  డేటా అందుబాటులో ఉన్న వాటిలో 14 కంపెనీలు సానుకూల ఇబిటాని చూపించాయి.