దసరాకు ఎంత తాగారో తెలిస్తే.. కిక్కు ఎక్కుద్ది

దసరాకు ఎంత తాగారో తెలిస్తే.. కిక్కు ఎక్కుద్ది

మూడ్రోజుల్లో రూ. 406 కోట్ల లిక్కర్ సేల్

హైదరాబాద్, వెలుగు: దసరాకు లిక్కర్పై రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆదాయమొచ్చింది. పండుగ టైమ్లో రూ. 406 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో మద్యం డిపోల నుంచి రూ. 406 కోట్ల విలువైన మద్యాన్ని వైన్స్లకు తరలించారు. 22న రూ. 131 కోట్లు, 23న రూ. 175 కోట్లు, 24న రూ. 100 కోట్ల లిక్కర్ బయటకొచ్చింది. ఇందులో 4.71 లక్షల కేసుల లిక్కర్, 4.44 లక్షల కేసుల బీర్లున్నాయి. ఈ లిక్కర్ను పండుగ టైమ్లో, సోమవారం అమ్మారు. సాధారణంగా ఒక రోజులో రూ. 70 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు సేల్స్ జరుగుతుంటాయి. ఇక ఈ నెలలో 24వ తేదీ వరకు రూ. 1,979 కోట్ల మద్యాన్ని అమ్మారు. గతేడాది ఇదే టైమ్లో రూ. 1,374 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి.

మరిన్ని వార్తలు

బండి సంజయ్​ గొంతుపట్టి కారులోకి తోసేసిన పోలీసులు