కాంగ్రెస్ కోసం పని చేసే నాయకులకే పదవులు : ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్

కాంగ్రెస్ కోసం పని చేసే నాయకులకే పదవులు :  ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్
  • కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్​

బోధన్​,వెలుగు: కాంగ్రెస్  కోసం పని చేసే నాయకులకే పదవులు దక్కుతాయని కర్టాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ అన్నారు. ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బోధన్ పట్టణంలోని లయన్స్​ క్లబ్​ హాల్​లో సంటఘన సృజన్ అభియాన్​ నిర్వహించారు. డీసీసీ ప్రెసిడెంట్​ నియామకానికి బోధన్ నియోజకవర్గంలోని బ్లాక్ ఏ, బ్లాక్​ బీ కాంగ్రెస్ ముఖ్య నాయకుల అభిప్రాయాలు సేకరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీనీ  ప్రధాన మంత్రిని చేయడానికి అధిష్టానం డీసీసీ, సీసీసీ ల నియామకం చేపట్టిందన్నారు. దేశంలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ను, సీబీఐ ను తమ వద్ద ఉంచుకొని ఎవరూ తమను ఓడించలేమనే అహంకారంతో ఉందన్నారు.  పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అహంకారం చూపడంతోనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.  

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, నాయకులు అరెపల్లి మోహన్ , రవి బాబు, డీసీసీబీ  చైర్మన్ రమేశ్​రెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, గ్రంథాలయ జిల్లా చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి,  కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.