లాక్‌డౌన్ ఉల్లంఘిస్తున్నవారు ఒకశాతం మాత్రమే

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తున్నవారు ఒకశాతం మాత్రమే

హైదరాబాద్‌లో గడిచిన 17 రోజులుగా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోందన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. పాతబస్తీలో లాక్‌డౌన్ అమలును ఆయనతో పాటు అడిషనల్ సీపీ చౌహాన్ పరిశీలించారు. 99 శాతం మంది ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు సీపీ అంజనీ కుమార్. కేవలం ఒక శాతం ప్రజలే అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు.

ప్రతిరోజూ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9వేల లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయని.. 6వేల వాహనాలు సీజ్ అవుతున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. నగరంలో 180 చెక్‌పోస్టుల దగ్గర 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.