కశ్మీరీల డిమాండ్లను భారత్ నెరవేర్చాలి

కశ్మీరీల డిమాండ్లను భారత్ నెరవేర్చాలి

భారత్‌‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం చర్చలు జరిపేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే చర్చలకు అవసరమైన వాతావరణాన్ని నెలకొల్పే బాధ్యత భారత్‌‌దేనని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పారు. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గని నేపథ్యంలో భారత్-పాక్‌‌లు గురువారం హఠాత్తుగా ఓ ప్రకటన చేశాయి.

బార్డర్‌‌లో శాంతియుత పరిస్థితుల స్థాపనకు అనుగుణంగా 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఇండో-పాక్‌‌లు అనౌన్స్‌‌మెంట్ చేశాయి. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఓ ట్వీట్ చేశారు. ‘లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించడాన్ని నేను స్వాగతిస్తున్నా. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు కావాల్సిన పరిస్థితులను నెలకొల్పే బాధ్యత మాత్రం భారత్ మీదే ఉంది. యూఎన్‌‌సీసీ తీర్మానానికి తగ్గట్లుగా ఎన్నాళ్లుగానో కశ్మీర్ ప్రజలు కోరుతున్న డిమాండ్లను నెరవేర్చే దిశగా ఇండియా చర్చలు చేపట్టాలి’ అని ఖాన్ ట్వీట్ చేశారు.