
హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్ చికిత్సకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్-.. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన ప్రపంచ స్థాయి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) సెంటర్ ను ప్రారంభించింది. దీని ద్వారా అనేక రక్త రుగ్మతలకు ఒకే దగ్గర ట్రీట్ మెంట్ అందించవచ్చని యశోద హాస్పిటల్స్ డాక్టర్లు తెలిపారు.
బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొఫెసర్ డా. మమెన్ చాందీ, కలకత్తా టాటా మెడికల్ సెంటర్ డైరెక్టర్, ప్రొఫెసర్ డా. నవీన్ ఖత్రీ చీఫ్గెస్టులుగా పాల్గొన్నారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డా. పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. బ్లడ్ క్యాన్సర్‌పై ప్రతిఒక్కరికి పూర్తి అవగాహన అవసరమని చెప్పారు. బ్లడ్ క్యాన్సర్ రోగులు చికిత్స తర్వాత పూర్తిగా సాధారణ జీవితాన్ని గడపవచ్చని ఆయన పేర్కొన్నారు.