
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 25 మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు 233 ఖరారు అయ్యాయి. గత ఎన్నికల టైంలో 237 ఉండగా, 4 స్థానాలు తగ్గాయి. బిచ్కుంద మండల కేంద్రాన్ని ఇటీవల ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చింది. దీంతో ఇక్కడ ఎంపీటీసీ స్థానాలు 4 తగ్గాయి. గత ఎన్నికప్పుడు 22 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఈసారి 3 పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాల్వంచ, మహమ్మద్‌నగర్, డొంగ్లి మండలాలుగా ఏర్పడ్డాయి. జిల్లాలో అత్యధికంగా 15 ఎంపీటీసీ స్థానాలు గాంధారి మండలంలో ఉన్నాయి.
భిక్కనూరు, జుక్కల్, మాచారెడ్డి మండలాల్లో 14 చొప్పున, బాన్సువాడలో 11, బీబీపేట 8, బిచ్కుంద10, బీర్కుర్‌లో 7, దోమకొండ 9, డొంగ్లిలో 5, కామారెడ్డిలో 6, మాచారెడ్డిలో 14, మద్నూర్‌లో 12, మహమ్మద్‌నగర్‌లో 5, నాగిరెడ్డిపేటలో 10, నస్రుల్లాబాద్‌లో 8, నిజాంసాగర్‌లో 5, పాల్వంచలో 6, పెద్దకొడప్గల్లో 7, పిట్లంలో 13, రాజంపేటలో 8, రామారెడ్డిలో 10, సదాశివనగర్‌లో 12, తాడ్వాయిలో 9, ఎల్లారెడ్డిలో 8 స్థానాలు ఉన్నాయి.