ఏప్రిల్ 30న సచివాలయం ఓపెనింగ్.. ఫ్లోర్ల వారీగా శాఖల కేటాయింపు

ఏప్రిల్ 30న సచివాలయం ఓపెనింగ్.. ఫ్లోర్ల వారీగా శాఖల కేటాయింపు

ఏప్రిల్ 30న కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా బీఆర్కే భవన్ నుంచి షిఫ్టింగ్ పనులు ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 28వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయంలో ఫ్లోర్ల వారీగా శాఖలను కేటాయించారు. ఈ సందర్భంలోనే సెక్రటేరియట్ ప్రారంభం తర్వాత, సీఎం కేసీఆర్ సచివాలయం ప్రాంగణంలోనే సుదర్శన యాగం చేయనున్నట్టు తెలుస్తోంది.

గ్రౌండ్ ఫ్లోర్ లో.. ఎస్సీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ శాఖలు
మొదటి అంతస్తులో.. ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖ
2వ అంతస్తులో.. ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖ
3వ అంతస్తులో.. ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ఎస్సీ డిపార్ట్మెంట్స్, ప్లానింగ్ డిపార్ట్ మెంట్
4వ అంతస్తులో.. బీసీ వెల్ఫేర్, ఫారెస్ట్, కల్చరల్ డిపార్ట్మెంట్, నీటి పారుదల శాఖ, లా డిపార్ట్ మెంట్
5వ అంతస్తులో.. టీఆర్ అండ్ బీ, GAD శాఖలు
6 అంతస్తులో.. సీఎం, సీఎస్ లకు కేటాయింపు