తిరుమలలో చిక్కిన మరో చిరుత..ఇకపై ప్రశాంతంగా

తిరుమలలో చిక్కిన మరో చిరుత..ఇకపై ప్రశాంతంగా

తిరుమల శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత కార్యక్రమం ముగిసింది. ఎట్టకేలకు అలిపిరి కాలినడక మార్గంలో ట్రాప్ కి నాలుగో చిరుత చిక్కింది. వారం రోజులుగా చిరుతను ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆదివారం రోజు (ఆగస్టు 27న) రాత్రి 7వ మైలు వద్ద ట్రాప్ కి చిక్కింది చిరుత. అలిపిరి కాలినడక మార్గంలో సంచరిస్తున్న చిరుతలను అధికారులు బంధించడంతో.. ఇకపై భక్తులు ప్రశాంతంగా నడక మార్గంలో సంచరించే అవకాశం ఉందంటున్నారు. 

బోనులో చిక్కిన చిరుతను ఫారెస్ట్ అధికారులు తిరుపతి ఎస్వీ జూపార్క్ కు తరలించారు. ఎట్టకేలకు చాలా వ్యయప్రయాసాల అనంతరం నాలుగో చిరుత బోనులో చిక్కింది. ఆగష్టు 15వ తేదీనే ఈ నాలుగో చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆగష్టు 15వ తేదీ నుండి నిరంతరంగా ఆపరేషన్ చిరుత కార్యక్రమం కొనసాగించారు. నేటితో నడకమార్గంలో సంచరిస్తున్న చిరుతల బెడదకు చెక్ పెట్టినట్లు అయ్యింది.