ఆపరేషన్ సముద్ర సేతు.. ఇరాన్‌ నుంచి స్వదేశానికి రానున్న ఇండియన్స్‌

ఆపరేషన్ సముద్ర సేతు.. ఇరాన్‌ నుంచి స్వదేశానికి రానున్న ఇండియన్స్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న స్వదేశీయులను జల మార్గంలో తీసుకురావడానికి ఇండియా గవర్నమెంట్‌ సముద్ర సేతు అనే ఇనీషియేటివ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సముద్ర సేతు ద్వారా ఇరాన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌ను నేవల్ షిప్ ద్వారా స్వదేశానికి రప్పించనున్నారు. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నుంచి స్వదేశీ ప్రయాణికులతో గుజరాత్‌లోని పోర్‌‌బందర్‌‌కు వస్తున్న నేవీ షిప్ జర్నీ సోమవారం ప్రారంభమవనుంది. ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ దీనికి సంబంధించిన సిటిజన్స్‌ లిస్ట్‌ను ప్రిపేర్ చేస్తోంది. లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులను మెడికల్ స్క్రీనింగ్ తర్వాతే షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతించనున్నారు. ఐఎన్‌ఎస్ శార్దూల్‌ అనే నేవీ షిప్ ద్వారా సదరు స్వదేశీయులను తిరిగి ఇండియాకు తీసుకురానున్నారు. ఆ ప్రయాణికులు ఇండియా చేరుకోగానే వారిని తమ స్టేట్ అథారిటీస్‌కు అప్పగించనున్నారు.

విదేశాల్లో చిక్కుకున్న ఇండియన్స్‌ను తిరిగి స్వదేశానికి తరలించేందుకే ఈ షిప్స్‌ను సిద్ధం చేశామని నేవీ తెలిపింది. ఐఎన్ఎస్ శార్దూల్‌లోని స్టాఫ్ సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటిస్తున్నారని నేవీ పేర్కొంది. మెడికల్ స్టాఫ్, డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్స్, మెడికల్ స్టోర్స్, రేషన్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్, ఫేస్ మాస్కులు లాంటి వాటిని షిప్‌లో సమకూర్చామని.. కరోనా క్రైసిస్‌లో భాగంగా తాము తయారు చేసిన కొన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్‌ను కూడా షిప్‌లో ఉంచామని వివరించింది. ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా మాల్దీవ్స్‌, శ్రీలంక నుంచి కోచి, ట్యుటికోరిన్ పోర్టులకు 2,874 మందిని ఐఎన్ఎస్ నేవల్ షిప్స్‌ జలశ్వ, మగర్ సేఫ్‌గా చేర్చాయి.