ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది..భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండాలి: సీడీఎస్ చౌహాన్

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది..భద్రతాదళాలు అప్రమత్తంగా  ఉండాలి: సీడీఎస్ చౌహాన్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని, భద్రతాదళాలు 24x7, 365 రోజులు అలర్ట్​గా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సూచించారు. ఆర్మీ 'శాస్త్రం' (యుద్ధం), 'శాస్త్ర' (నాలెడ్జ్) రెండింటి గురించి తెలుసుకోవడం చాలా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. 

శుక్రవారం ఢిల్లీలో జరిగిన రక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. నేటి సైనికులు మూడు స్థాయిల యుద్ధాలలో నైపుణ్యం సాధించాలని ఆయన  సూచించారు. సమాచారం, సాంకేతికత, జ్ఞాన యోధుడిగా ఉండాలని ఒక కొత్త దృష్టిని వెల్లడించారు. ఆధునిక యుద్ధం ‘కన్వర్జెన్స్ యుద్ధం’గా మారుతోందని, ఇందులో వ్యూహాత్మక, కార్యాచరణాత్మక, టాక్టికల్ స్థాయిలు, అలాగే స్థల, వాయు, సముద్ర, సైబర్, అంతరిక్ష రంగాలు సమ్మిళితమవుతున్నాయన్నారు.

 కాబట్టి సైనికుడు సమాచార, సాంకేతిక, జ్ఞాన యోధుడిగా ఉండాలని, ఈ మూడు లక్షణాల సమ్మేళనం ఆధునిక యుద్ధంలో అవసరమని పేర్కొన్నారు. డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు, స్వదేశీ రక్షణ వ్యవస్థలు ఆపరేషన్ సిందూర్‌లో విజయానికి కీలకమయ్యాయని, ఈ సాంకేతికతలు భారత భూభాగానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.