
భారత్, పాక్ మధ్య కాల్పుల విమరణ ఒప్పందం ఉన్నప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్రం భద్రతపై పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు జరిపిన కొన్ని వారాల తర్వాత మరోసారి పాక్ సరిహద్దు రాష్ట్రాలలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. గురువారం( మే20) జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
ఏప్రిల్22న పహల్గాంలో ఉగ్రదాడి..26మంది టూరిస్టులను కాల్చిచంపిన తర్వాత భారత్..ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది..ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఈ క్రమంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో ఇదివరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవేళదాడులు జరిగితే ఎలా స్పందించాలనేదానిపై అవగాహన కల్పించారు. అయితే ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత మరోసారి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.
ALSO READ | మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం..గవర్నర్ను కలిసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఈ మాక్ సెషన్ లో చొరబాటుదారులను ఎలా ఎదుర్కొవాలి, ప్రాణనష్టం జరగకుండా ప్రజలను ఎలా తరలించాలి, దాడి జరిగితే ఎలా స్పందించాలి అనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా సంస్తలు అప్రమత్తంగా ఉంది దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొనే చర్యలు ముమ్మరం చేశాయి.