
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)పై తీవ్ర ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్.. టెర్రరిస్టులతో పాటు పాక్ కు బుద్ధి చెప్తామని హెచ్చరించిన క్రమంలో.. అన్నట్లుగానే ఆపరేషన్ సిందూర్ పేరున మంగళవారం (మే 6) రాత్రి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ఇండియా-పాక్ యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయాలు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో నెలకొన్నాయి.
ఇండియా పాకిస్తాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణంతో పాక్ టీ20 లీగ్ లో ఆడుతున్న ఓవర్సీస్ ప్లేయర్లలో భయాందోళనలు మొదలైనట్లు తెలుస్తోంది. లీగ్ నుంచి తప్పుకోవాలని కొందరు ప్లేయర్లు భావిస్తున్నట్లు మీడియా వర్గాల కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఫ్రాంఛైజ్ కు చెందిన స్క్వాడ్ లో ఐదు నుంచి ఆరు మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
అయితే పాక్ క్రికెట్ బోర్డు (PCB) మాత్రం అలాంటిదేం లేదు.. ఫారిన్ ప్లేయర్లు ఎవరూ వెళ్లడం లేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. లీగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఎవరూ వెళ్లడం లేదని పీసీబీ తెలిపింది. అయితే 6 ఫ్రాంచైజ్ లకు చెందిన మీడియా మేనేజర్లు ఆ విషయాన్ని ధృవీకరించారు. ఓవర్ సీస్ ప్లేయర్లు లీగ్ నుంచి వైదలగనున్నట్లు అంతర్గతంగా వార్తలు వస్తున్నాయని.. కానీ ఇప్పటి వరకు ఏ తమను ఈ విసయంలో సంప్రదించలేదని చెప్పారు.
►ALSO READ | RR vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. రెండు మార్పులతో చెన్నై
పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియా విరుచుకు పడుతుండటంతో.. యుద్ధం తప్పేలా లేదని భావించిన పాక్ క్రికెట్ బోర్డు పలు మ్యాచ్ ల షెడ్యూళ్లను మార్చుకుంది. ఎక్కువ శాతం మ్యాచ్ లను రావల్పిండిలో జరిగేలా షెడ్యూల్ లో మార్పులు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ మే 11న ముల్తాన్ లో జరగనుందని ప్రకటించింది.
2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసారన్ మైదాన ప్రాంతంలో టూరిస్టులను ఊచకోత కోశారు ఉగ్రవాదులు. ముష్కరులు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక టూరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడికి భారత్ రివేంజ్ తీర్చుకుంది.
పహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్.. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. చెప్పినట్లుగానే 2025, మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌లోని టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ ఎటాక్‌లో లష్కరే తోయిబా, జైషీ మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్ ఆపరేషన్ సిందూర్ తో దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది.