
ఐపీఎల్–18లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చావో రేవో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో బుధవారం (మే 7) చెన్నై సూపర్‌కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న నైట్‌రైడర్స్ వరుసగా మూడు నెగ్గితే 17 పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్‌రేట్, ఇతర సమీకరణాలపై తక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఢిల్లీ, రాజస్తాన్‌తో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా గెలవడం కేకేఆర్‌లో కాన్ఫిడెన్స్ పెంచింది.
ఈ కీలక మ్యాచ్ లో కేకేఆర్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. వెంకటేష్ అయ్యర్ స్థానంలో మనీష్ పాండే ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్న సూపర్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సామ్ కరణ్ స్థానంలో కాన్వే.. రషీద్ ప్లేస్ లో ఉర్విల్ పటేల్ తుది జట్టులో స్థానం సంపాదించారు.
►ALSO READ | IND vs SA: ట్రై సిరీస్ ఫైనల్లో టీమిండియా.. సఫారీలపై ఘన విజయం సాధించిన కౌర్ సేన