Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. మెరుపు వేగంతో వెళ్లాం.. బాంబులేశాం.. వచ్చేశాం.. భారత్ టార్గెట్ చేసిన తొమ్మిది టెర్రర్ క్యాంపుల లిస్ట్ ఇదే..

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. మెరుపు వేగంతో వెళ్లాం.. బాంబులేశాం.. వచ్చేశాం.. భారత్ టార్గెట్ చేసిన తొమ్మిది టెర్రర్ క్యాంపుల లిస్ట్ ఇదే..

పహల్గాం ఉగ్రదాడి ఘటనకు భారత్ బదులు తీర్చుకుంది. పాకిస్తాన్‌పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతో పాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ మిసైళ్లతో అటాక్‌ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.

‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీవోకే, పాకిస్తాన్లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది.

పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్టు చేశారు. భారత్ టార్గెట్ చేసిన తొమ్మిది టెర్రర్ క్యాంపుల లిస్ట్ ఇదే..

భారత్ టార్గెట్ చేసిన తొమ్మిది టెర్రర్ క్యాంపుల లిస్ట్ ఇదే..
* ముజఫరాబాద్ (2 చోట్ల)
* కోట్లీ
* బింబార్
* మురిడ్కే
* గుల్ పూర్
* బహావల్ పూర్
* సియాల్ కోట్
* చాక్ అమ్రూ