పాక్కు చెందిన అనేక జెట్లను కూల్చివేశాం:ఎయిర్ మార్షల్ ఏకే భారతి

పాక్కు చెందిన అనేక జెట్లను కూల్చివేశాం:ఎయిర్ మార్షల్ ఏకే భారతి

ఆపరేషన్ సింధూర్ విజయాన్ని భారత త్రివిద దళాల అధిపతులు ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ పై ఎయిర్ ఫోర్స్ దాడులను  భారత ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఆదివారం (మే11) మీడియాకు వివరించారు.

పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని శతృస్థావరాలపై విజయవంతంగా దాడులు చేశాం..ఎంత ప్రాణనష్టం జరిగింది.. ఎంతమందికి గాయాలయ్యాయి అనేది వారు లెక్కించుకోవాలి. ‘‘మా లక్ష్యం ప్రాణనష్టం కలిగించడం కాదు.. ఒకవేళ అది జరిగితే దానిని లెక్కించడం వారిపని’’ అని స్పష్టం చేశారు. మా పని లక్ష్యాన్ని చేధించడం.. బాడీలను లెక్కంచడం కాదు అన్నారు ఎయిర్ మార్షల్ ఏకే భారతి. 

పాకిస్తాన్ విమానాలు సరిహద్దుల్లోకి రాకుండా నిరోధించాం. సరిహద్దుల అవతలే వాటిని ధ్వంసం చేయడంతో మా దగ్గర వాటికి సంబంధించిన శిథిలాలు లేవు.. అయితే పాక్ చెందిన చాలా విమానాలను మేం కూల్చివేశామని స్పష్టం చేశారు. మాదగ్గర లెక్క ఉంది..అయితే టెక్నికల్ వివరాలతో సహా చెపుతామన్నారు.  

పస్రూర్, చునియన్,  ఆరిఫ్వాలా ఎయిర్ డిఫెన్స్ రాడార్‌లతో పాటు సర్గోధా, రహీమ్ యార్ ఖాన్, చక్లాలా (నూర్ ఖాన్), సుక్కూర్, భోలారి ,జాకబాబాద్ లక్ష్యంగా పాకిస్తానీ సైనిక ప్రదేశాలపై భారత వైమానిక దాడులు చేశామని దాడులకు సంబంధించిన వీడియోను ఎయిర్ మార్షల్ ఎకె భారతి ప్రదర్శించారు.

మరోవైపు భారత ఆర్మీ డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వివరాలను తెలిపారు.  పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని మొత్తం 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామని.. పుల్వామా, కాందాహార్, హైజాకర్ ఉగ్రవాదిని చంపేశామని భారత ఆర్మీ డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మీడియాకు వివరించారు.

కీలకమైన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు. మే 7వ తేదీ సాయంత్రం డ్రోన్లు, మిసైల్స్ భారత్ వైపు దూసుకొచ్చాయని, భారత రక్షణ వ్యవస్థ ప్రతీ పాక్ డ్రోన్ను పేల్చేసిందని డీజీఎంవో పేర్కొన్నారు. పాక్ జరిపిన ఈ దుశ్చర్యకు కౌంటర్ గా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై దాడులు చేశామని చెప్పారు.