Operation Sindoor: సిందూర్‌‌ పేరే ఎందుకంటే.?

Operation Sindoor: సిందూర్‌‌ పేరే ఎందుకంటే.?

పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో మిసైళ్లతో భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ముజఫరాబాద్ (2 చోట్ల). మే 6  మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతోపాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ మిసైళ్లతో అటాక్‌ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 13 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. 

పాక్ దాడుల క్రమంలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతోంది. సిందూర్ అంటే ఎంటి? సిందూర్ పేరుతోనే భారత్ ఎందుకు దాడులు జరుపుతోందంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే పహల్గామ్ టెర్రర్ అటాక్ లో కొత్తగా పెళ్లైన నవ వధువరూలు కూడా ఉన్నారు. నేవీ అధికారి వినయ్ ను టెర్రరిస్ట్ హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృతదేహం దగ్గర అతడి భార్య ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. అలాగే టెర్రర్ అటాక్ లో  హిందూత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందూత్వ ప్రతీకారంగా,  మహిళల సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది.


దాడులను ధ్రువీకరించిన పాక్ 

ఇండియన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటాక పీవోకేలోని కోట్లి, ముజఫరాబాద్, బాహావల్‌పూర్‌‌సహా 9 ప్రాంతాల్లో దాడులు జరిపిందని పాకిస్తాన్‌ ఆర్మీ ధృవీకరించింది. ఈ అటాక్‌లో అనేక భవనాలు నేలమట్టం అయ్యాయని తెలిపింది. పాక్‌ డీజీ ఐఎస్‌పీఆర్‌ లెప్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ స్పందిస్తూ పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని చెప్పారు. ముజఫరాబాద్‌లోని పవర్ గ్రిడ్‌ను పేల్చివేయడంతో కరెంటు పోయి, చిమ్మ చీకట్లు అలుముకున్నాయని, ముజఫరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు.