ఆపరేషన్ స్మోకింగ్ : పబ్లిక్‌గా పొగ తాగితే పోలీస్‌స్టేషన్‌కే

ఆపరేషన్ స్మోకింగ్ : పబ్లిక్‌గా పొగ తాగితే పోలీస్‌స్టేషన్‌కే
  • దమ్ముకొడితే.. దుమ్ము దులుపుతరు
  • రూ.200 ఫైన్.. ఆపై కౌన్సెలింగ్
  • సీరియస్ గా ఆపరేషన్ స్మోకింగ్ అమలు
  • డయల్ 100కు సమాచారమివ్వాలని సీపీ పిలుపు

రోడ్లపై, బస్టాప్ లు, పాన్ పులు, ఇతర పబ్లిక్‌ ప్లేసుల్లో దమ్ము కొట్టే పొగరాయుళ్ల పని పట్టనున్నారు సిటీ పోలీసులు. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్‌, బీడీ, చుట్ట వంటివి తాగొద్దని చట్టం ఉన్నా స్మో కర్స్‌ గానీ, పోలీసులు గానీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఇక నుంచి సీరియస్ గా తీసుకోబోతున్నారు పోలీసులు. దీని కోసం ‘ఆపరేషన్ స్మోకింగ్ ’ అమలు చేయబోతున్నారు. దీని ప్రకారం ఎవరైనా నిషేధిత ప్రదేశాల్లో పొగతాగితే వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు . అక్కడ 200 ఫైన్‌ వేయడంతో పాటు కౌన్సెలిం గ్‌ ఇస్తారు . దీనికోసం సీపీ అంజనీకుమార్‌ ఆధ్వర్యం లో స్పెషల్‌ ప్లాన్‌ రూపొందిం చారు. అక్టోబర్ లో సిటీలో నిర్వహిం చబోయే హెల్త్ కాన్ఫరెన్స్ కు ముందే నగరాన్ని స్మోక్​ ఫ్రీగా మార్చాలని సీపీ పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశిం చారు. ఎవరైనా పబ్లిక్‌ ప్లేసుల్లో స్మో క్‌ చేస్తే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని కోరారు.

హైదరాబాద్ , వెలుగు : వెంకట్ బస్ స్టాప్ లో నిల్చుని సిగరెట్​కాలుస్తూ గుప్పుగుప్పున పొగ వదులుతూ అక్కడున్న వారికి ఇబ్బంది కలిగించాడు. పక్కనే ఉన్నవాళ్లు 100కి కాల్ చేసి విషయం చెప్పారు. అతని చేతిలో సిగరెట్ పూర్తి అయ్యే లోపు స్పాట్ కి పోలీసులు వచ్చారు. స్టేషన్ కి తీసుకెళ్లి రూ.200 ఫైన్​ వేశారు. మరోసారి బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్​కాల్చొద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు. కొన్ని రోజుల్లో ఇలాంటి సీన్లే రోజూ కనిపించనున్నాయి. సిటీని స్మోక్​ఫ్రీగా చేయడానికి పోలీసులు ‘ఆపరేషన్​స్మోకింగ్’​ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

స్మోకర్లపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పొగ తాగడం (స్మోకింగ్) వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ‘నో టొబాకో డే-2019’ సందర్భంగా బషీర్ బాగ్ పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన రెండ్రోజుల వర్క్ షాప్ ను పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీని ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ.. స్మోకింగ్ వల్ల తలెత్తే టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు.
హైదరాబాద్ ను స్మోక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం- 2003 ను పటిష్టవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్ లో నో స్మోకింగ్ పై అవగాహనా సెంటర్లను నిర్వహిస్తామని వివరించారు.

అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తాం

ప్రపంచ దేశాల్లో స్మోకింగ్లో చైనా మొదటి స్థానంలో ఉండగా ఇండియా రెండో స్థానంలో ఉందని సీపీ తెలిపారు. టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులు నివారించేందుకు పొగ తాగడంపై ప్రజల్లో అవగాహన రావాలన్నారు.  ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సిటీ పోలీసులకు రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. స్మోకింగ్ వ్యాధులపై అవగాహన పెంచేందుకు హైదరాబాద్ వేదికగా 50వ ప్రపంచ సదస్సు జరుగనుందని చెప్పారు.
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు నాలుగు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో సుమారు 130 దేశాల నుంచి 6000 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశాలున్నాయని తెలిపారు. 2017 లెక్కల ప్రకారం టీబీ వల్ల దేశవ్యాప్తంగా 4,10,000 మంది, రాష్ట్రంలో 45,160 మంది చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నట్టు చెప్పారు. వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే 30శాతం మంది చనిపోయినట్లు తెలిపారు.