వింగ్ కమాండర్ కబీర్

వింగ్ కమాండర్ కబీర్

ఎయిర్ ఫోర్స్  బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. ఇందులో నవదీప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శుక్రవారం తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేశారు మేకర్స్. 

 ‘వింగ్ కమాండర్ కబీర్’ పాత్రలో నవదీప్  కనిపించనున్నట్టు రివీల్ చేస్తూ, తన లుక్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నవదీప్ లుక్ ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్ కూడా ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్న ఈ చిత్రంలో రాడార్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా మానుషి చిల్లర్‌‌‌‌‌‌‌‌ నటించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 16 న విడుదల కానుంది.