షర్మిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నం ; వైఎస్ఆర్ టీపీ నేతలు

షర్మిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నం ; వైఎస్ఆర్ టీపీ నేతలు

ఖైరతాబాద్, వెలుగు:  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఏకపక్ష నిర్ణయంతో ఎన్నికలకు వెళ్లేది లేదని ప్రకటించడాన్ని తాము వ్యతి రేకిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో వారు మీడియాతో మాట్లాడారు.   వైఎస్ రాజశేఖర్​రెడ్డి కూతురుగా తండ్రిలా మాటపై నిలబడుతుందని నమ్మి, ఆమె వెంట వెళితే.. తమను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. 

పార్టీలో చర్చించకుండా  పోటీకి దూరంగా ఉండి,  కాంగ్రెసుకు సపోర్టు చేద్దామంటే తాము అంగీకరించమని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో కో– ఆర్డినేటర్లు మహ్మద్​ ఇబ్రహీం (షాద్​నగర్​), అయూబ్​ఖాన్(​మలక్​పేట్),క్రిస్టియన్​సెల్​ పార్టీ అధ్యక్షుడు డేవిడ్​ శాంతరాజ్,రామలింగారెడ్డి (గజ్వేల్)​, ఇ.వెంకటరెడ్డి ( జనగాం) తదితరులు పాల్గొని మాట్లాడారు.