ఎమ్మెల్సీ కవిత హామీపై ప్రతిపక్షాల ఆగ్రహం

ఎమ్మెల్సీ కవిత హామీపై ప్రతిపక్షాల ఆగ్రహం

జగిత్యాల, వెలుగు : జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన హామీపై  ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నవ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని కవిత దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణం కోసం రూ. కోటి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉండగా  ఓటర్లను మభ్యమెట్టడానికి ఎమ్మెల్సీ కోటా నుంచి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారని కవితపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. వెంటనే ఎలక్షన్స్  ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలు తొలగింపు

  జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలకు హాజరవుతున్న ఎమ్మెల్సీ కవిత ఉన్న ఫ్లెక్సీలను బల్దియా సిబ్బంది తొలగించారు.  రూల్స్ కు విరుద్దంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రిటర్నింగ్ ఆఫీసర్లకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆఫీసర్లు  ఆదేశాలతో ఫ్లెక్సీలు తొలగించారు.