
కాంగ్రెస్ అంటే ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదని… దుబ్బాక ఫలితంతో తెలిసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ వెనుబడిన సందర్భంగా పరిస్థితులు పరిశీలిస్తే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని తేలిందన్నారు. దుబ్బాకలో కౌంటింగ్ లో ప్రజల నాడి తేటతెల్లమైందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని రాష్ట్ర ప్రజలు ఒక దేవతగా భావిస్తారని… ఆమె కారణంగానే తెలంగాణ వచ్చిందనేది టీఆర్‌ఎస్ నాయకులు కూడా ఒప్పుకున్నారన్నారు. అయితే శ్రీనివాసరెడ్డిని అభ్యర్తిగా నిలిపినా, ప్రజలు టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేక ఓటును బీజేపీకి వేశారన్నారు. స్థానికుడైన రఘునందన్ రావు ముందునుంచే యోజకవర్గంలో ప్రచారం చేసుకోవడం కలసి వచ్చిందన్నారు మధుయాష్కీ.