ప్రతిపక్షాలు నామినేషన్ వేయలేని పరిస్థితిలో ఉన్నాయ్

ప్రతిపక్షాలు నామినేషన్ వేయలేని పరిస్థితిలో ఉన్నాయ్

నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. మంగళవారం కోటిరెడ్డి నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా mc కోటిరెడ్డిని సీఎం కేసీఆర్  నిర్ణయించారన్నారు.ఈ రోజు నామినేషన్ దాఖలు చేశామని.. కోటిరెడ్డి ఎన్నిక  లాంఛనమే...గెలుపు  ఎప్పుడో ఖాయం అయిందన్నారు.

అభ్యర్థి కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన  ముఖ్యమంత్రికి, కేటీఆర్ కి, ధన్యవాదాలు అన్నారు.  టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు,  అందరికి రుణపడి ఉంటానని... నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ..కోటిరెడ్డి గెలుపు ఖాయం అయిందని తెలిపారు. ప్రతిపక్షాలు కనీసం నామినేషన్ వేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని...ఇచ్చిన మాట నిలుపుకున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని కొనియాడారు మోత్కుపల్లి.