యశ్వంత్ సిన్హా నామినేషన్ కు హాజరైన రాహుల్, కేటీఆర్

యశ్వంత్ సిన్హా నామినేషన్ కు హాజరైన రాహుల్, కేటీఆర్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు . అపోజిషన్ పార్టీల మద్దతుతో ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో ఉన్నారు. నామినేసన్  కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే, జైరాం రమేష్ , ఎన్సీపీ నుంచి శరద్ పవార్, ప్రపుల్ పటేల్,  ఎస్పీ నుంచి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే నుంచి రాజా, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, నామా, ఎన్సీ నుంచి ఫరూఖ్ అబ్దాల్లా హాజరయ్యారు. అటు టీఎంసీ నుంచి సౌగతో రాయ్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరీ అటెండయ్యారు. 

 

 

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి  ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ వేశారు. రాజ్యసభ సెక్రటేరియట్ లో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ ఆమె నామినేషన్ ను ప్రతిపాదించగా..50మంది సభ్యులు బలపరిచారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.