తెలంగాణ మార్కెట్లోకి ఆప్టిగల్ స్టీల్

తెలంగాణ మార్కెట్లోకి ఆప్టిగల్ స్టీల్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వేగంగా పెరుగుతున్న మౌలిక  సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఆర్సెలర్ మిట్టల్,  నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ (ఏఎం/ఎన్​ఎస్​ఇండియా) ఆప్టిగల్ స్టీల్‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది. యూరోపియన్   ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ స్టీల్​ తుప్పును నిరోధిస్తుందని తెలిపింది.

 రాష్ట్రంలోని నిర్మాణ రంగ అవసరాలను తీర్చడానికి  దీర్ఘకాలిక పరిష్కారాలను అందిస్తుందని పేర్కొంది. ఇది నిర్మాణాల జీవితకాలాన్ని పెంచుతుందని, నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుందని,  భద్రతకు హామీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 

తమ స్టీల్ ఉత్పత్తి తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉందని, రాష్ట్ర భవిష్యత్ నిర్మాణాలకు ఇది ఒక కీలకమైన భాగం అవుతుందని ఏఎం/ఎన్​ఎస్​ ఇండియా పేర్కొంది.