మౌత్ వాష్ ఆర్డ‌రిస్తే..రెడ్ మీ నోట్ 10 ఫోన్ వ‌చ్చింది

మౌత్ వాష్ ఆర్డ‌రిస్తే..రెడ్ మీ నోట్ 10 ఫోన్ వ‌చ్చింది

ముంబై: ఆన్ లైన్ కాస్ట్లీ వ‌స్తువులు ఆర్డ‌ర్ చేస్తే ధ‌ర‌ త‌క్కువ వ‌స్తువులు..ఒక్కోసారి ర‌క‌ర‌కాల చీప్ వ‌స్తువులు డెలివ‌రీ అయిన సంఘ‌ట‌న‌లు ఎన్నో చూశాం. ఒక వ‌స్తువు అర్డ‌ర్ చేస్తే మ‌రోటి వ‌స్తుంటాయి. ఇలాంటి సంఘ‌ట‌న లేటెస్ట్ గా జ‌రిగింది. కానీ ఈ సారీ క‌స్ట‌మ‌ర్ లాస్ కాలేదు క‌దా ల‌క్కీ ఛాన్స్ కొట్టేశాడు.  ముంబైకి చెందిన లోకేష్ అనే వ్య‌క్తి అమెజాన్ లో కాల్గేట్ మౌత్ ఫ్రెష్ న‌ర్ ఆర్డర్ చేశాడు. అయితే డెలివ‌రీ రాగానే ఓపెన్ చేసి చూస్తే షాక్ అయ్యాడు.

ఎందుకంటే అందులో బ్రాండ్ న్యూ రెడ్ మీ నోట్ 10 ఫోన్ ఉంది. ఎందుకైనా మంచిద‌ని ఫోన్ రిట‌ర్న్ పెట్టాడ‌ట‌. అయినా స్పందించ‌ని సంస్థ రిట‌ర్న్ పెట్టినా తీసుకోవ‌ట్లేద‌ట‌. దీంతో ఈ విష‌యాన్ని లోకేష్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌గా లోక‌మంతా తెలిసి తెగ వైర‌ల్ అవుతోంది. అమెజాన్ లో చేసిన ఆర్డ‌ర్ వివ‌రాలు.. డెలివ‌రీలో వ‌చ్చిన రెడ్ మీ నోట్ 10 ఫోన్ ఫొటోస్ పోస్ట్ చేశాడు. దీంతో ల‌క్కీలో ప‌డ్డావ్ బ్ర‌ద‌ర్ అంటూ లోకేష్ కి రీ ట్వీట్స్ వ‌దులుతున్నారు నెటిజ‌న్లు.