దివ్యాంగ బంధు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి:డెఫ్ సంస్థ

దివ్యాంగ బంధు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి:డెఫ్ సంస్థ
  • డెవలప్​మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ సంస్థ డిమాండ్ 

ముషీరాబాద్,వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రభుత్వ శాఖల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ‘ది డెవలప్​మెంట్ సొసైటీ ఫర్ డెఫ్’ సంస్థ డిమాండ్ చేసింది. మంగళవారం నల్లకుంటలో డెఫ్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వల్లభనేని ప్రసాద్, వి. భారతి మాట్లాడుతూ.. దివ్యాంగ బంధు,  నిరుద్యోగ భృతి ఇవ్వాలని, బ్యాక్​లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఇందుకు చీఫ్ సెక్రటరీని కలుస్తామని తెలిపారు. 

గత శుక్రవారం సెక్రటేరియట్​కు వెళ్తే అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆసరా పెన్షన్లు రూ.10 వేలకు పెంచాలని, స్వయం ఉపాధికి రూ. 5 లక్షలు ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. బోగస్ దివ్యాంగుల సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.