
మెగా హీరో వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. ఇవాళ (2025 సెప్టెంబర్ 10న) హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఈ గుడ్ న్యూస్తో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.
Our little man 🩵🩵🩵
— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2025
10.09.2025 pic.twitter.com/dFTCFFPl9o
ఈ తరుణంలోనే చిరంజీవి కూడా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సెట్స్ నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్లి వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే న్యూస్ వైరల్ అవ్వడంతో ‘తాత అయిన నాగబాబు’ అంటూ జనసైనికులు విషెస్ చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. 2025 మే6న తాము తమ మొదటిబిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాము. కమింగ్ సూన్’ అని తాము ఇరువురు క్యాప్షన్ పెట్టారు. ఇక నేడు వరుణ్-లావణ్య తల్లిదండ్రులవ్వడంతో సోషల్ మీడియాలో పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ALSO READ : రోషన్తో మలయాళ క్రేజీ బ్యూటీ రొమాన్స్..
దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. వారు మొదటిసారి కలుసుకున్న ప్రదేశం ఇటలీలో వివాహం చేసుకున్నారు. 2023 నవంబర్ 1న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీతో పాటు అతి కొద్దీ మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
Life’s most beautiful role yet -
— Varun Tej Konidela (@IAmVarunTej) May 6, 2025
Coming soon ♥️♥️♥️ pic.twitter.com/532M5e8muV