AnaswaraRajan: రోషన్తో మలయాళ క్రేజీ బ్యూటీ రొమాన్స్.. ఎవరీ అనస్వర రాజన్?

AnaswaraRajan: రోషన్తో మలయాళ క్రేజీ బ్యూటీ రొమాన్స్.. ఎవరీ అనస్వర రాజన్?

మలయాళ హీరోయిన్స్‌‌ తెలుగునాట మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్‌‌‌‌డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మరో మలయాళ  హీరోయిన్‌‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఛాంపియన్’ చిత్రంలో హీరోయిన్‌‌గా నటిస్తోంది అనస్వర రాజన్.

తాజాగా ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌తో పాటు తన క్యారెక్టర్‌‌‌‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో చంద్రకళ పాత్రలో అనస్వర కనిపించనుందని తెలియజేశారు. ఫస్ట్ లుక్‌‌లో ఆమె ట్రెడిషినల్‌‌గా​ కనిపిస్తూ ఆకట్టుకుంది. కారులో కూర్చోని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ఆమె సాంప్రదాయబద్ధంగా కనిపించింది.

రెట్రో స్టైల్‌‌లో ఉన్న ఈ పోస్టర్‌‌‌‌లో సినిమాపై ఆసక్తిని పెంచింది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. రోషన్ ‘ఛాంపియన్’ మూవీతో పాటుగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. కన్నడ డైరెక్టర్ నంద కిషోర్ తో రోషన్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ మూవీకి ‘వృషభ’ (Vrushabha) అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ రోషన్ కి తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. పీరియాడికల్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. రోషన్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఎవరీ అనస్వర రాజన్:

చైల్డ్​ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ అందం.. పలు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్లో యారియాన్​​2 లో అనశ్వర మెరిసింది. త్రిషతో కలిసి రాంగీ లో నటించింది. అలాగే, ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన  ‘7/జీ బృందావన కాలనీ’ సీక్వెల్లో సైతం నటిస్తుంది.

ఇకపోతే, ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్గా ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోస్ పోస్ట్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్లో ఎలాంటి విజయం అందుకోనుందో చూడాలి మరి!