కాంగ్రెస్ పాలిటిక్స్..హైదరాబాద్​ టు ఢిల్లీ వయా బెంగళూరు​

కాంగ్రెస్ పాలిటిక్స్..హైదరాబాద్​ టు ఢిల్లీ వయా బెంగళూరు​
  • పార్టీ వ్యవహారాలన్నీ డీకే శివకుమార్ కనుసన్నల్లోనే
  • చేరికల నుంచి మేనిఫెస్టో దాకా అన్నీ ఆయన చెప్పినట్టే
  • షర్మిల ఎపిసోడ్‌‌ నుంచి పొంగులేటి, జూపల్లి, తుమ్మల చేరిక దాకా..
  • కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత డీకేకు పెరిగిన ప్రాధాన్యం
  • రేవంత్ సహా సీనియర్లతోనూ మంచి సంబంధాలు
  • హైదరాబాద్‌‌లో సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణలో కీ రోల్
  • తెలంగాణ ఎన్నికలకు పార్టీ అనధికారిక ఇన్‌‌చార్జ్‌‌లా డీకే

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్ర పార్టీకి సంబంధించిన వ్యవహారాలు హైదరాబాద్‌‌ టు ఢిల్లీ వయా బెంగళూరు అన్నట్లుగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌‌లో ముఖ్య నాయకుల చేరికల దగ్గర్నుంచి.. రాష్ట్రంలో అమలు చేయాల్సిన రాజకీయ ప్రణాళికల వరకు.. అన్నీ కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలవడం, అందులో డీకే శివకుమార్ ముఖ్య పాత్ర పోషించడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే హైకమాండ్ ఆయన్ను తెలంగాణ ఎన్నికలకూ అన్ అఫీషియల్ ఇన్‌‌చార్జ్‌‌గా నియమించిందని ప్రచారం జరుగుతున్నది. 

ఇటీవల చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలన్నీ అందుకు బలం చేకూరుస్తున్నాయి. డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పీసీసీ చీఫ్ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం వల్లనే పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ బెంగళూరు వేదికగా జరుగుతున్నాయని చర్చ సాగుతున్నది.

అక్కడి నుంచే స్ట్రాటజీస్

రాష్ట్రంలో అమలు చేయాల్సిన ముఖ్యమైన ప్రణాళికలన్నింటికీ బెంగళూరు కేంద్రంగానే రూపకల్పన చేస్తున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొనే వ్యూహాలు, ప్రచార శైలి, మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలన్నింటినీ డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించిన తర్వాతే ఇక్కడ అమలు చేస్తున్నారని సమాచారం. సునీల్ కనుగోలు ఆఫీసు బెంగళూరులోనే ఉండడం, అక్కడి ప్రభుత్వానికి ఆయన ముఖ్య సలహాదారుగా ఉండడంతో.. అక్కడి నుంచే స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నది. డీకే శివకుమార్​ వల్లే కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిందని భావిస్తున్న హైకమాండ్.. తెలంగాణకు అన్ అఫీషియల్ ఇన్​చార్జిగా నియమించిందని ప్రచారం సాగుతున్నది. ప్రస్తుత ఇన్​చార్జి మాణిక్ రావు ఠాక్రేకి తోడు..

ALSO READ: ఓటర్ల సందేహాలకు ఓటరు సహాయ మిత్ర

ఆయనకు బాధ్యతలను అప్పగించినట్టు తెలు స్తున్నది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం, ఆమె చేరికకు సంబంధించిన విషయాలన్నింటినీ డీకే శివకుమార్ స్వయంగా డీల్ చేస్తున్నారు. ఈ విషయంపైనే మూడు నాలుగుసార్లు ఆయనతో షర్మిల భేటీ కూడా అయ్యారు. తన పార్టీ విలీనానికి సంబంధించి దాదాపు నెలన్నర రోజులు షర్మిల బెంగళూరులోనే ఉన్నారన్న చర్చలు అప్పట్లో జోరుగా సాగాయి. అయితే ఆమె చేరికకు పీసీసీ చీఫ్ రేవంత్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.

ఈ విషయంలో రేవంత్ బయట పడకపోయినా.. ఆమెను పార్టీలోకి తీసుకోవద్దన్న స్టాండ్​తోనే ఉన్నారన్న వాదనలున్నాయి. దీంతో ఈ విషయంపై డీకే శివకుమార్.. రేవంత్​తో పలుమార్లు చర్చలు జరిపారని సమాచారం. హైదరాబాద్ నుంచి కాకుండా బెంగళూరు నుంచే ఆమె ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారని డిస్కషన్ జరుగుతున్నది.

సీనియర్ల మధ్య గొడవలకుచెక్ పెట్టేందుకే..

కొద్ది రోజుల క్రితం వరకు పార్టీలోని సీనియర్ లీడర్ల మధ్య గొడవలు తీవ్రంగా ఉండేవి. రేవంత్ రెడ్డి, ఉత్తమ్, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ లీడర్ల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండేది. అయితే ఈ మధ్య అవి కాస్తంత తగ్గాయి. దానికి కారణమూ డీకే శివకుమారేనన్న చర్చ జరుగుతున్నది. లీడర్ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు హైకమాండ్.. ఆయనకు పవర్స్​ఇచ్చిందన్న వాదన ఉన్నది. సీనియర్ లీడర్లయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వాళ్లకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్​కు చోటు దక్కడంలోనూ, స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, మధు యాష్కీలకు చోటు రావడంలోనూ  డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారన్న టాక్ ఉంది.

చేరికల్లో ఆయనే కీలకం

బీఆర్ఎస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌‌లోకి వచ్చే విషయంలోనూ డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావుల చేరిక, వారికి టికెట్ల కేటాయింపు హామీని కూడా ఆయనే ఇచ్చారని ప్రచారంలో ఉంది. వారి చేరికలకు సంబంధించి ప్రతి అడుగూ ఆయన చెప్పినట్టే సాగిందంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు సీడబ్ల్యూసీలో చోటు కోసం పలువురు నేతలు డీకే శివకుమార్ ద్వారా అర్జీలూ పెట్టుకున్నారని అంటున్నాయి.

సీడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహించడంలో ఆయన పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశాల కోసం శివకుమార్​ హైదరాబాద్​కు వచ్చినప్పుడు ఆయన్ను కలిసిన పలువురు బీసీ నేతలు.. తమకు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. శుక్రవారం బెంగళూరులో శివకుమార్​ను కలిశారు. కాంగ్రెస్​లో చేరేందుకు ఇంట్రెస్ట్​ చూపించారు.