తెలంగాణ సర్కార్ స్పందించకపోతే ఆమరణ దీక్ష: షెజల్​ 

తెలంగాణ సర్కార్ స్పందించకపోతే ఆమరణ దీక్ష: షెజల్​ 
  • ఢిల్లీలోని ఇండియా గేట్ ఎదుట బాధితురాలి నిరసన

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు బోడపాటి షెజల్ మరోసారి ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని ఇండియా గేట్ ఎదుట ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. తక్షణమే ఎమ్మెల్యే చిన్నయ్య ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని ఒక వీడియో రిలీజ్ చేశారు.

ఈ విషయంలో తెలంగాణ సర్కార్ స్పందించపోతే ఆమరణ నిరహార దీక్ష దిగుతానని హెచ్చరించారు. కాగా, తనకు న్యాయం చేయాలని మూడు రోజులుగా షెజల్ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై నేషనల్ ఉమెన్ కమిషన్, నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తర్వాతి రోజు ఢిల్లీలోని తెలంగాణ భవనలో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. జంతర్ మంతర్ లోనూ ధర్నా చేస్తున్నారు.