దసరా నుంచి ‘ఓరి వారి’ సాంగ్ ప్రోమో

దసరా నుంచి ‘ఓరి వారి’ సాంగ్ ప్రోమో

హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దసరా'. ఎస్.ఎల్.వి. సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.  తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఓరి వారి సాంగ్ ప్రోమోను చిత్ర బృందం  రిలీజ్ చేసింది.  'ఓరి వారి నీదు గాదుర పోరి .. ఇడిసెయ్ రా ఇంగ .. ఒడిసెను దారి' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ నెల 13న పూర్తి సాంగ్ విడుదలవనుంది. 

దసరా మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ధూమ్ ధామ్ సాంగ్‌‌, టీజర్‌‌‌‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయికుమార్, దీక్షిత్ శెట్టి ముఖ్యమైన పాత్రలను పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చగా.. ఈ సినిమా  మార్చి 30న రిలీజ్ కానుంది. బొగ్గు గనుల బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని సింగరేణి కార్మికుని లుక్‌‌లో కనిపించనున్నాడు.