జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నిరంతరం పెంచుకోవాలి

జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నిరంతరం పెంచుకోవాలి
  • జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నిరంతరం పెంచుకోవాలి
  •      ఓయూ ప్రొఫెసర్  శ్రీరాములు
  •     కాకా అంబేడ్కర్‌‌ కాలేజీలో ఓరియంటేషన్ ప్రోగ్రాం

ముషీరాబాద్, వెలుగు:  ఆధునిక ప్రపంచంలో పోటీ పడేందుకు విద్యార్థులందరూ తమ జ్ఞానాన్ని,  నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ  సీనియర్ ప్రొఫెసర్  డి. శ్రీరాములు అన్నారు.  బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్‌‌  బీఆర్‌‌ అంబేడ్కర్‌‌ కళాశాలలోని ఎంబీఏ 2023-–25 బ్యాచ్ నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ప్రొఫెసర్ డి. శ్రీరాములు,  కాకా ఇనిస్టిట్యూషన్స్  జాయింట్ సెక్రటరీ పీవీ రమణ కుమార్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా ప్రొఫెసర్ డి . శ్రీరాములు ఓయూ అందించే పాఠ్యాంశాలను క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు.  బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు కీలకమైన వివిధ నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి విద్యార్థులు చురుకుగా ఉండాలని సూచించారు.  కాకా  ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్స్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.