కేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజు : రఘునందన్ రావు

కేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజు  : రఘునందన్ రావు

మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజు దక్కిందని దుబ్బాక బీజేపీ  ఎమ్మెల్యే  రఘునందన్ రావు ఆరోపించారు.  ఐఆర్ఎల్ కంపెనీ రూ. 7 వేల 272 కోట్లకు టెండర్ వేసింది. ప్రభుత్వం మాత్రం రూ.  7 వేల 380 కోట్లకు వస్తాయని చెప్పి్ంది.  వేసిన బిడ్ కంటే ఐఆర్ఎల్ కంపెనీ ఎందుకు ఎక్కువ ఇస్తోందని ప్రశ్ని్ంచారు.  

ఓఆర్ఆర్  కాంట్రాక్టు  బిడ్  ను ఈ ఏడాది  ఏప్రిల్  11న  తెరిచినట్టుగా  రఘునందన్ రావు  చెప్పారు. కానీ  ఏప్రిల్  27న  ఈ విషయాన్ని  మున్సిపల్ శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్   మీడియాకు  ప్రకటన విడుదల చేశారని ఆయన  గుర్తు  చేశారు.  బిడ్ ఓపెన్  చేసిన  16 రోజుల తర్వాత  ఈ విషయాన్ని  ఎందుకు  బయటపెట్టారని  ప్రశ్నించారు. 

ఓఆర్ఆర్ పై బేస్ ప్రైజ్ ను నిర్ణయించడంలో  రాష్ట్ర ప్రభుత్వం  ఫెయిలైందని రఘునందన్ విమర్శించారు . కనీసం  హెచ్ 1, హెచ్ 2, హెచ్ 2, హెచ్ 4 కంపెనీలు పిలిచి  బేస్ ప్రైజ్ కు తక్కువగా  బిడ్ కోడ్  చేసినందున  టెండర్ ను క్యాన్సిల్ చేస్తామని  ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండేదన్నారు.  ఓఆర్ఆర్ పై  ఏప్రిల్ మాసంలో  సగటున  రూ. 2 కోట్ల 2 లక్షల ఆదాయం వచ్చిందని  చెప్పారు.