బిగ్ రిలీఫ్ : ల్యాంకో హిల్స్ నుంచి ORR లింక్ రోడ్డు రెడీ

బిగ్ రిలీఫ్ : ల్యాంకో హిల్స్ నుంచి ORR లింక్ రోడ్డు రెడీ

హైదరాబాద్​ ప్రజలకు ట్రాఫిక్​ నుంచి బిగ్​ రిలీఫ్​ కలుగనుంది.  ల్యాంక్​ హిల్స్​ నుంచి ORR లింక్ రోడ్డు రెడీ రడీ అయింది.  2.89 కిలో మీటర్ల వరకు నార్సింగ్​.. .పుప్పాలగూడ వరకు లింక్​ రోడ్లను కలుపుతూ   గేబియన్​ గోడను నిర్మించినట్లు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(GHMC), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్(MAUD) అధికారులు తెలిపారు.  దీనిని నిర్మించేందుకు   మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  అరవింద్ కుమార్ చొరవ చూపారు.  30 శాతం కంటె తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

90 కోట్ల రూపాయిలతో అంచనా వేసిన ఈ ప్రాజెక్టులో 8–20 మీటర్ల ఎత్తులో 1.12 కిలో మీటర్ల మేర గేబియన్​ గోడ నిర్మించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు.  ఈ రహదారి ల్యాంకో హిల్స్ జంక్షన్ నుంచి  ORR సర్వీస్ రోడ్ లింక్, నార్సింగి-పుప్పల్‌గూడ వరకు కీలమైన మార్గంగా మారుతుందన్నారు.  ఈ ప్రాంతంలో ట్రాఫిక్​ తగ్గేందుకు ఈ రహదారి నగర వాసులకు ఎంతో ఉపయోగపడుతుదని  అధికారులు తెలిపారు.