అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం..నాల్గో ఫ్లోర్ నుంచి దూకి.. జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి

అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం..నాల్గో ఫ్లోర్ నుంచి దూకి.. జర్మనీలో తెలంగాణ విద్యార్థి  మృతి

జర్మనీ లో జనగామ జిల్లా యువకుడు మృతి చెందాడు.  అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరగ్గా.. తప్పించుకునే ప్రయత్నంలో మృతి చెందినట్లు తెలుస్తోంది.  మృతుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డిగా గుర్తించారు. 

ఎంఎస్ చేయడం కోసం 2023లో జర్మనీ వెళ్లాడు హృతిక్ రెడ్డి.  బెర్లిన్ లోని అపార్ట్మెంట్ లో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు.  అకస్మాత్తుగా అగ్నిప్రమాధం సంభవించడంతో బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో నాల్గో  అంతస్తు పై నుంచి దూకాడు హృతిక్. తీవ్రగాయాలైన అతను  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  దీంతో  తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు హృతిక్ కుటుంబసభ్యులు