ముగిసిన ఆర్థోపెడిక్స్‌‌‌‌‌‌‌‌ పీజీ టీచింగ్‌‌‌‌‌‌‌‌

ముగిసిన ఆర్థోపెడిక్స్‌‌‌‌‌‌‌‌ పీజీ టీచింగ్‌‌‌‌‌‌‌‌

పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ ఆర్థోపెడిక్స్‌‌‌‌‌‌‌‌ విభాగం ఆధ్వర్యంలో ఐవోఏ ఆర్థోపెడిక్స్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ టీచింగ్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండ్రోజుల పాటు జరిగిన ఈ ఇంటెన్సివ్‌‌‌‌‌‌‌‌ అకాడమిక్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమం ఆదివారం ముగిసింది. 

గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీజీ స్టూడెంట్స్​ పాల్గొన్నారు. క్లినికల్‌‌‌‌‌‌‌‌ స్కిల్స్​, డయాగ్నోస్టిక్‌‌‌‌‌‌‌‌ పై విద్యార్థులకు అవగాహన పెంచేలా ఈ కార్యక్రమం రూపొందించగా.. పేషెంట్‌‌‌‌‌‌‌‌ఎగ్జామినేషన్‌‌‌‌‌‌‌‌, క్లినికల్‌‌‌‌‌‌‌‌చర్చలు, కేస్‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌ డిస్కషన్‌‌‌‌‌‌‌‌, హ్యాండ్స్‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలు చేపట్టారు. 

గెస్టులుగా ఐవోఏ పీజీ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్, కోర్స్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌లు డాక్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌ జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అకాడమిక్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఎం.వి.రెడ్డి, గాంధీ ఆర్థోపెడిక్​ అసోసియేట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ రవి, సీనియర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాకల్టీ సభ్యులు డాక్టర్‌‌‌‌‌‌‌‌ అంజనేయులు, డాక్టర్‌‌‌‌‌‌‌‌ రవీంద్రనాథ్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.