ఆస్కార్ .. బెస్ట్ యాక్టర్ జోక్విన్ ఫీనిక్స్

ఆస్కార్ .. బెస్ట్ యాక్టర్ జోక్విన్ ఫీనిక్స్

లాస్ ఏంజిల్స్ లో 2020 ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది . లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లోహాలీవుడ్ తారలతో పాటు పలు దేశాలకి చెందిన నటీనటుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రపంచంలోని తారలంతా ఒకే చోట చేరడంతో డాల్బీ థియేటర్  ప్రాంగణం సందడిగా మారింది. 92వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాలకి సంబంధించి అవార్డులు దక్కాయి.

  • ఉత్తమ నటుడు – జోక్విన్ ఫీనిక్స్ (జోకర్)
  • ఉత్తమ నటి – రెనీ జెల్వెగర్
  • ఉత్తమ చిత్రం –పారాసైట్
  • ఉత్తమ డైరెక్టర్ – బోన్ జోన్ హో(పారాసైట్)
  • ఉత్తమ యానిమేటేడ్  షార్ట్  ఫిలీం –  హెయిర్ లవ్
  • ఉత్తమ సహాయ నటుడు – బ్రాడ్ పిట్  (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ మూవీ)
  • ఉత్తమ సహాయ నటి – లోరా డెన్ 
  • బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్  ఫిలిం –  టాయ్ స్టోరీ 4 
  • బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే –   బాంగ్ జాన్ హూ, హ్యాన్ జిన్ (పారాసైట్ మూవీ)

 

ఫోర్డ్  వర్సెస్ ఫెరారీకి బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, 1917మూవీకి అవార్డుల పంట పండింది. బెస్ట్ సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో 3 ఆస్కార్లు దక్కాయి. ఫీచర్ డాక్యుమెంటరీగా అమెరికన్ ఫ్యాక్టరీ నిలిచింది. లిటిల్ ఉమెన్ చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాక్వెలైన్ డురెన్ ఆస్కార్ దక్కింది. బార్బరా లింగ్, నాన్సి హైకి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. ది నైబర్స్ విండోకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది.  బాంబ్ షెల్ మూవీకి బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ విభాగాల్లో ఆస్కార్లు దక్కాయి.