ఆస్కార్ అవార్డ్స్.. రెడ్ కార్పెట్ స్థానంలో షాంపైన్ కార్పెట్

ఆస్కార్ అవార్డ్స్.. రెడ్ కార్పెట్ స్థానంలో షాంపైన్ కార్పెట్

సినీ ఇండస్ట్రీలోనే అత్యంత గౌరవనీయమైనది భావించే అవార్డు ఆస్కార్. 90ఏళ్లకు ఈ ఆవార్డులను ప్రదానం చేస్తుండగా.. ఈ సారి మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఈ వేడుకలకు ఓ స్పెషాలిటీ ఉంది. భారతీయ సినిమా ఖ్యాతిని చాటి చెప్పిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు నామినేట్ కావడం ఒకటైతే..  ఈ సారి అవార్డ్ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే రెడ్ కార్పెట్ కలర్ మారనుండడం మరో స్పెషాలిటీ. దీంతో 62ఏళ్లలో తొలిసారిగా ఈ మార్పు రావడంపై ఆ మూమెంట్ కోసం ప్రేక్షకులతో యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

ఏ అవార్డ్ షో అయినా రెడ్ కార్పెట్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీనిపై నడవాలని చాలా మంది తారలు ఓ కలగా ఊహించుకుంటూ ఉంటారు. తమ గ్లామర్ ను చూపిస్తూ.. రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఉంటారు. 1961 నుంచి అంటే 33వ అకాడమీ అవార్డు వేడుకల నుంచి రెడ్ కార్పెడ్ పై సినీ స్టార్స్ నడుస్తూ ఉండగా.. ఈ సారి మాత్రం ఆ రెడ్ కార్పెట్ రంగు మారనుంది. సంవత్సరాల నుంచి వస్తోన్న సంప్రదాయాన్ని మార్చి.. ఆస్కార్ వేడుకలను నిర్వహిస్తోన్న అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఈ సారి రెడ్ కార్పెట్ కు బదులు షాంపైన్ రంగును ఎంచుకుంది.

హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్స్ లో జరగనున్న ఈ ఆస్కార్ వేడుకలకు అకాడమీ భారీ ఏర్పాటు చేస్తోంది. జిమ్మీ కిమ్మెల్ మూడోసారి ఈ అవార్డుల ప్రదానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ప్రతీ ఏడాది నటీనటులకు స్వాగతం పలికే రెడ్ కార్పెట్ .. ఈ సారి రంగు మారడంతో ఆ స్థానంలోషాంపైన్ కార్పెట్ ను అమర్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ కావడంతో భారతీయులంతా ఆ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో రెండు ఇండియన్ డాక్యుమెంటరీలకు చోటు దక్కింది. ఇక 94వ ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో విల్ స్మిత్ చెంపదెబ్బ వివాదాన్ని మరపించేలా ఈ సారి వేడుకలు నిర్వహించేందుకు అకాడమీ సన్నాహాలు చేస్తోంది.