విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఓయూ

 విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఓయూ

హైదరాబాద్: ఈ నెల 22 నుండి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో  ప్రారంభం కావాల్సిన పీజీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ నిన్న  అర్ధరాత్రి వరకు ఓయూలో విద్యార్థులు చేసిన ఆందోళనపై స్పందించిన యూనిర్సిటీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేసింది. 
ఆర్ఆర్ బీ, కానిస్టేబుల్ పరీక్షల సమయంలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఎంతో కాలంగా ఉద్యోగ అవకాశాలు లేక కష్టపడ్డామని.. తీరా ఇప్పుడు అవకాశాలు ముంగిటకు వచ్చాక సెమిస్టర్ పరీక్షలు పెడితే ఎలా అని విద్యార్థులు ప్రశ్నించారు. తమ ఉద్యోగ అవకాశాలను కాలరాసే విధంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న ఓయూ అధికారులు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తేదీల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.