టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటు

 టీఎస్‌పీఎస్సీ బోర్డును  ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటు

మంత్రి కేటీఆర్ టీఎస్‌పీఎస్సీ బోర్డును  ప్రక్షాళన చేస్తామని చెప్పడం సిగ్గు చేటని అన్నారు ఓయూ స్టూడెంట్లు.. రాష్ట్రంలో అన్ని పేపర్లు లీకైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  ఇన్ని రోజులు నిరుద్యోగులు ఎందుకు గుర్తుకు రాలేదని కేటీఆర్ ను ప్రశ్నించారు.  బీఆర్ఎస్ మాయ మాటల్ని నమ్మే పరిస్థితుల్లో నిరుద్యోగులు లేరన్నారు.  ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు  బీఆర్ఎస్ కు  తగిన బుద్ధి చెబుతారన్నారు.10ఏళ్లుగా బయటికి రాని సీఎం కేసీఆర్, కేటీఆర్.. డిసెంబర్ 4న అశోక్ నగర్ కు  వస్తామని చెబుతుండటం నమ్మేలా లేదన్నారు.  

దేశంలో ఎక్కడైనా నిరుద్యోగం ఉందంటే అది తెలంగాణలోనే అని చెప్పారు ఓయూ స్టూడెంట్లు. రాష్ట్రంలో జరిగింది పేపర్ లీకేజ్ కాదని పేపర్లను అమ్ముకున్నారని చెప్పారు. నిరుద్యోగ యువత నిరుద్యోగ చైతన్య యాత్ర మొదలైన తర్వాత కేటీఆర్ భయపడి బయటికొచ్చారన్నారు.  టీఎస్‌పీఎస్సీలో అక్రమాలు జరిగాయని,  అసమర్ధులను టీఎస్‌పీఎస్సీలోకూర్చోబెట్టారని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్ నాశనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.  

ALSO READ : Good News : 3 వేల ఇంజినీరింగ్ ఉద్యోగాలను ప్రకటించిన వాచ్ కంపెనీ